ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం
చౌటుప్పల : మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో ఎల్లంబావి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి గురువారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ గంజి వనజా కృష్ణ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే గ్రామపంచాయతీ పరిపాలన మరింత సౌకర్యవంతంగా సాగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ సామిడి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు కప్పరి భుజంగం, వనం రాఘవేందర్, అనబత్తుల సంధ్యా ఉపేందర్, గట్టు కావ్య రాజశేఖర్, వర్కల స్వర్ణ, కంది శ్రావణి సంతోష్‌రెడ్డి, కంకల మల్లయ్య, మాజీ సర్పంచ్ గుర్రంకొండల్, మాజీ పాలకవర్గ సభ్యులు కంది లక్ష్మారెడ్డి, పన్నాల ప్రతాపరెడ్డి, కంది రవికాంత్‌రెడ్డి, బాలరత్నం, ఏల కొండయ్య, ఏఈ నీతీష్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు