రక్తదానం ప్రాణదానం మహాదానం
*రక్తదానం ప్రాణదానం – మహాదానం*
*అన్ని దానాలలో రక్తదానం మహోన్నత కార్యక్రమం*
*జాతీయ స్వచ్చంద రక్తదాన ప్రతిజ్ఞ*
పులివెందుల మేజర్ న్యూస్,:
జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి మరియు కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్), ఆర్ ఆర్ సి విభాగం ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనిత అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వ్యాఖ్యాత, రొటేరియన్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే అత్యంత గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిరంతరం స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, ఒక యూనిట్ రక్తం ద్వారా పలువురి ప్రాణాలను రక్షించవచ్చని విద్యార్థినులకు వివరించారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలే ప్రాణదాతలుగా నిలుస్తారని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనిత, అధ్యాపకులు ఓబుల్ రెడ్డి లు మాట్లాడుతూ యువతలో రక్తదానంపై అవగాహన పెరగడం సమాజానికి ఎంతో అవసరమని, విద్యార్థినులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఐసీటీసీ మరియు ఎస్‌టీఐ కౌన్సిలర్లు వెంకటసుబ్బయ్య, బాదల్ వల్లి లు మాట్లాడుతూ హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణతో పాటు సురక్షిత రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అపోహలను విడనాడి స్వచ్ఛంద రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక మంది రోగులకు, ప్రమాద బాధితులకు, గర్భిణులకు మరియు అత్యవసర చికిత్స అవసరమైన వారికి ప్రాణాధారంగా నిలవవచ్చనే సందేశాన్ని విద్యార్థుల తో ప్రతిజ్ఞ చేయించారు.తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శివరాం రెడ్డి,ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి,విద్యార్థినులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.