BREAKING
*తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి.. 59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హార్టికల్చర్‌ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు

బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు

Select Suryaa Now
బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు

బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు కుట్ర

బీసీలకు  వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు

హైకోర్టు సాక్షిగా బట్టబయలు

రాష్ట్ర బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వరప్రసాద్

పులివెందుల మేజర్ న్యూస్ :

బీసీల రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని, బీసీలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని
బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన విధానం ఇప్పుడు హైకోర్టు తీర్పుతో బట్టబయలైందని రాష్ట్ర బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్, మాజీ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్, మాజీ కోఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, వల్లెపు శ్రవణ్ లు అన్నారు. గురువారం పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అమలు చేసే విషయంలో ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఉంటే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి.. చివరకు న్యాయపరమైన చిక్కులు తలెత్తేలా వ్యవహరించడం బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆనాడే స్పష్టంగా హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. బీసీలకు న్యాయం జరిగేంత వరకు వైకాపా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు బీసీలను చిన్నచూపు చూడడం మంచి పద్ధతి కాదన్నారు. ఏ బీసీలను అయితే విస్మరిస్తున్నావో ఆ బీసీలే నిన్ను మళ్లీ గద్దె దింపేందుకు సిద్ధమవుతారన్నారు. ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.