మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి
భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్.: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషాన్ని నలుమూలల చాటి చెప్పిన బహుజన వీరుడని,అతని యొక్క గౌడ జాతి కాకుండా అన్ని వర్గాలను పోరాట చైతన్యంతో తీర్చిదిద్ది గోల్కొండ కోటను కైవసం చేసుకున్న ధైర్యశాలి అని అన్నారు. అదేవిధంగా ఓరుగల్లు పక్కన ఉన్న కైలాసపూర్ గ్రామంలో పుట్టిన అతని స్వగ్రామం వరంగల్ అయినందున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న గౌడ్ పేరుతో విమానాశ్రయం నామకరణం చేయాలని, తద్వారా ప్రభుత్వం ఆయనకు తగిన గుర్తింపును ఇచ్చినట్లు అవుతుంది అన్నారు.