టాస్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
• మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య
సూర్య మంచిర్యాల జిల్లా ప్రతినిధి :తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అక్టోబర్ 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ www.telanganaopenschool.org నుండి సెప్టెంబర్ 26 నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.ప్రతి పరీక్ష రోజు విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని కనీసం రెండు రోజుల ముందుగానే సందర్శించి తెలుసుకోవాలని, దీనివల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు లేకుండా సకాలంలో కేంద్రానికి చేరుకోవచ్చని సూచించారు.మంచిర్యాల జిల్లాలోని టాస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరూ ఈ సూచనలను పాటించి పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ కోరారు.