కోటపాటి జనార్దన్‌రావు వదిన మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
పామూరు, మేజర్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి జనార్దన్‌రావు వదిన బొట్లగూడూరు మాజీ సర్పంచి కోటపాటి మాలకొండ రాయుడు సతీమణి కోటపాటి పద్మావతి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం మండలంలోని బొట్లగూడూరులోని కోటపాటి కుటుంబాన్ని పరామర్శించారు. పద్మావతి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాలకొండ రాయుడు, కోటపాటి జనార్దన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మావతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రనివాస్, క్లస్టర్ ఇన్‌ఛార్జి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టీడీపీ నాయకులు పువ్వాడి రామారావు గుంటుపల్లిశ్రీనివాసులు గోళ్ల వీరాంజనేయులు, గోగడ రత్తయ్య, కోటపాటి నరసింహారావు, గల్లా చెన్నయ్య, మార్నేని రామకృష్ణ, తదితరులు కోటపాటి పద్మావతి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.