60 లక్షల వ్యయం తో ముస్లిం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి పూజ
అనంతపురం బ్యూరో: అనంతపురం నగరంలోని లక్ష్మీ నగర్ లోని రామాలయం సమీపంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేతృత్వంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.