BREAKING
జర్నలిస్టుల దేశవ్యాప్త ధర్నాను విజయవంతం చేయాలి *టీయూడబ్ల్యూజే పిలుపు విద్యార్థి అవ్వ తాతలను సన్మానించిన మండల విద్యాశాఖ అధికారి! *అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టిసి వరుణ్ అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

నంద్యాలలో ‘ట్రైకాన్ ఎలివేటర్స్’ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

Select Suryaa Now
నంద్యాలలో  ‘ట్రైకాన్ ఎలివేటర్స్’ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల అర్బన్:నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్‌లో గల బాబుల్ రెడ్డి కాంప్లెక్స్‌లో నూతనంగా షేక్ అబ్దుల్ ఖాదర్ , షేక్ మహమ్మద్ అలీ , షేక్ ఖజా లు ఏర్పాటు చేసిన ప్రముఖ లిఫ్ట్ విడిభాగాల మరియు సేవల సంస్థ ‘ట్రైకాన్ ఎలివేటర్స్’ కార్యాలయాన్ని బుధవారం మంత్రి ఫరూఖ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అత్యాధునిక సాంకేతికత, నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఎలివేటర్ సేవలు ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు . నంద్యాలలో ఇప్పటికే విజయవంతంగా 100 కు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల విశ్వాసాన్ని పొందిన ‘ట్రైకాన్ ఎలివేటర్స్’ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఈ సంస్థ మరింతగా విస్తరించి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకులు షేక్ అబ్దుల్ ఖాదర్ , షేక్ మహమ్మద్ అలీ , షేక్ ఖజా లు మాట్లాడుతూ భారతదేశంలోనే పూర్తి స్థాయి ఎలివేటర్ కాంపోనెంట్స్ హబ్‌గా అత్యాధునిక విడిభాగాలు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాక్షన్ మిషన్లు, భద్రతా పరికరాలు తదితర ఉత్పత్తులతో పాటు నిరంతర సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు హాఫిజ్ అంజద్ బాషా సిద్ధిఖీ , నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కె.సి. కెనాల్ చైర్మన్ హాజీ ఇలియాస్, హాఫిజ్ అబ్దుల్ సలాం, హాఫిజ్ ఖాజా మియా , గోసుల నాగేశ్వరరావు, వార్డ్ ఇంచార్జి వేద సాయినాథ్ లతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, టీడీపీ నాయకులు, శ్రేయోభిలాషులు మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.