జర్నలిస్టుల దేశవ్యాప్త ధర్నాను విజయవంతం చేయాలి *టీయూడబ్ల్యూజే పిలుపు
*వేములపల్లి, మేజర్ న్యూస్:* జర్నలిస్టులహక్కులపరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న ధర్నా,నిరసనను విజయ వంతంచేయాలనిటీయూడబ్ల్యూజే-ఐజేయూ వేముల పల్లి మండల అధ్యక్షులు షేక్ మౌలాలి, ప్రధాన కార్యదర్శి తండు వెంకన్న గౌడ్, కోశాధికారి ముండ్ల కళ్యాణ్ యాదవ్ పిలుపు నిచ్చారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్య లను వెలుగులోకి తీసుకువస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్రపోషిస్తున్నప్పటికీ జర్నలిస్టుల హక్కులు, రక్షణ, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.గాంధీ జయంతి రోజున మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి తహసీల్దార్ కార్యాలయంలోవినతిపత్రం సమర్పించనున్నట్లుతెలిపారు.ఈ నిరసన కార్యక్రమం లో వేములపల్లి మండలం లోని ప్రతి జర్నలిస్టు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ల డంతో పాటు హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలనిఅన్నారు.