ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక*
*అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి మణికంఠ రెడ్డి, లక్ష్మణ్*
*ఘనంగా ముగిసిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు*
హనుమకొండ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవాల సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. హనుమకొండలో సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయని, 28వ తేదీన జరిగిన భారీ విద్యార్థి ర్యాలీ దేశం మొత్తం విస్తృత చర్చ జరిగిందని ,29,30 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ 90 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం పోరాటాలు, విజయాలు, విద్యారంగ సమస్యలపై చర్చించడం జరిగిందని,30వ తేదీ న రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర నూతన ఆఫీస్ బేరర్స్ కమిటీని ఎన్నుకున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి పుట్ట లక్ష్మణ్ తెలిపారు.గురువారం హనుమకొండలోని బాలసముద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి(కరీంనగర్), రాష్ట్ర కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్(మేడ్చల్) లు మరోసారి ఎన్నికైనట్లు అదే విధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటిక్యాల రామకృష్ణ(ఖమ్మం), రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రెహమాన్ (నల్గొండ), రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బానోత్ రఘురాం నాయక్ (నిజామాబాద్), లెనిన్ (ఉస్మానియా యూనివర్సిటీ), ముదిగొండ మురళికృష్ణ (నల్గొండ), బలుముల ప్రేమ్ కుమార్(నాగర్ కర్నూల్), రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా భాషబోయిన సంతోష్ (హనుమకొండ), నెల్లి సత్య (హైదరాబాద్), సామిడి వంశీవర్ధన్ రెడ్డి(రంగారెడ్డి), జేరిపోతుల జనార్ధన్(సిద్దిపేట) ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ తెలిపారు.ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయని, ఈ వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యలపై చర్చించి , భవిష్యత్ కార్యచరణ రూపొందించుకున్నామని, దేశంలో రాష్ట్రంలో పాలకులు విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని, బిజెపి ప్రభుత్వం విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణకు కుట్ర చేస్తున్నదని, తెలంగాణ విభజన హామీల ప్రకారం రాష్టానికి కేటాయించాల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా తెలంగాణ పట్ల చిన్న చూపు చూస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, విద్యకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించకుండా,విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించకుండా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో మద్యం షాపులను పెంచుతూ ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు కుట్ర చేస్తున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం కోసం పోరాటాలు నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి లక్ష్మణ్ తెలిపారు.ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఇటిక్యాల రామకృష్ణ, రాష్ట్ర కార్వనిర్వాహక కార్యదర్శి రెహమాన్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రఘురాం నాయక్, బాషోబోయిన సంతోష్,లెనిన్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ గౌడ్, వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదెళ్ల శరత్, నాయకులు భాను,వినయ్ తదితరులు పాల్గొన్నారు.