ప్రకృతి ద్రావణాల తయారీ
బాడంగి, అక్టోబర్ 1 (మేజర్ న్యూస్): గజరాయునివలస గ్రామంలో గురువారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులతో కలిసి నీమాస్త్రం, జిల్లేడు ద్రావణాన్ని సామూహికంగా తయారు చేశారు. ఎఫ్‌ఎంటీ వై. ఈశ్వరరావు ఆధ్వర్యంలో 100 లీటర్ల ద్రావణాన్ని తయారు చేశారు. స్థానికంగా లభించే సహజ వనరులతో తక్కువ ఖర్చుతో పంటలకు అవసరమైన ద్రావణాలను తయారు చేసుకోవచ్చని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించాలని రైతులకు సూచించారు. ఐసీఆర్‌పీ టీ. హైమా, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.