BREAKING
అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం..

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ బూటకం ఇదొక రాజకీయ డ్రామా

Select Suryaa Now
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ బూటకం  ఇదొక రాజకీయ డ్రామా

రాజ్యాంగం 9వ షెడ్యూల్ పెట్టి అమలు చేసే అవకాశం ఉన్న బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నారు

బుధవరపు బాలాజీ  జిల్లా బీసీవై పార్టీ అధ్యక్షులు

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్  :  నెల్లూరు నగరం వనంతోపు సెంటర్ల గల బీసీ వై పార్టీ కార్యాలయంలో బాలాజీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నాం అంటూ తమ ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసిందని బహుశా టీడీపీ ముందే ఊహించి ఉండవచ్చు. బీసీలకు రాజ్యాంగ బద్ధ పదవుల్లో రిజర్వేషన్‌ ఇవ్వాలంటే, రాజ్యాంగ బద్ధంగా గట్టి ప్రాతిపదిక కల్పించి ఇవ్వాలి తప్ప, పొలిటికల్‌ డ్రామా ప్రకారం ఇవ్వకూడదని ఇంతకు ముందు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 176 విషయంలో కూడా స్పష్టమయింది.  నిజానికి ఈ రెండు పార్టీలకు బీసీలకు రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ ఇచ్చే ఉద్దేశమే లేదు. 50 శాతానికి మించి రిజర్వేషన్‌ను ఎలా కల్పించటానికి అవకాశం ఉందో  సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నా, బీసీ జనాభా, బీసీల వెనకబాటు అనే రెండింటికీ శాస్త్రీయ ప్రాతిపదికలు ఉన్నా చూపకుండా నిర్లక్ష్యంగా, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే, ఇక రాజ్యాధికారం తమ రెండు కులాల చేతుల్లో ఉండదన్న అభిప్రాయంతోనే ఫేక్‌ జీవోలు విడుదల చేసి రెండు పార్టీలు డ్రామా ఆడాయి. గ్రౌండ్‌ లెవెల్‌లో, అంటే వార్డు, గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్‌ వరకు జనాభా దామాషాలో కనీసంగా 50 శాతం బీసీలకు; 19 శాతం ఎస్సీలకు; 6.8 శాతం ఎస్టీలకు స్థానిక సంస్థల సీట్లు కేటాయిస్తే... మొత్తంగా 75.8 శాతం ఈ పేద వర్గాలకే కనీసం కింది స్థాయిలో రాజ్యాధికారంలో వాటా దక్కుతుంది. ఇలాంటి పరిస్థితిని టీడీపీ నాయకత్వంగానీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం గానీ ఏమాత్రం ఆమోదించే స్థితిలో లేవు కాబట్టే; 34 శాతం డ్రామా ఆడి... చివరికి 50 శాతం పరిధిలో మిగిలిన 24 శాతంతో సర్దుకోండి అంటూ ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ బీసీలను మోసం చేస్తున్నాయి. బీసీలందరినీ అడుగుతున్నా. మీకు మీరు ఆలోచన చేయండి. టీడీపీ నాయకత్వంగానీ, వైయస్సార్‌సీపీ నాయకత్వంగానీ 50 శాతం సీట్లను స్థానిక సంస్థల్లో మన బీసీలకు కేటాయించాల్సి వస్తే అది వారికి గుండె పోటు వచ్చే అంశం అవుతుందే తప్ప, నిండు గుండెతో వారు ఆ పని చేయటానికి సిద్ధం అవుతారా?  మరి పరిష్కారం ఏమిటి? మిత్రులంతా ఆలోచన చేయాలి. 2027 జనాభా లెక్కలు పూర్తి అయ్యాయి.  100 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా బీసీ కులాల గణన కూడా జరిగింది. బీసీ జనాభా గణన కూడా జరిగింది. ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు మాదిరిగానే బీసీ సోదరులకు కూడా జనాభా దామాషాలో, కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే కాకుండా... రాష్ట్రాల శాసన సభలు, శాసన మండళ్ళలో;› పార్లమెంటు ఉభయ సభల్లో కూడా జనాభా దామాషాలో  రాజకీయ రిజర్వేషన్లు అడిగి, ఉద్యమించి, సాధించుకునేందుకు జనాభా లెక్కల్లో కులాల వారీ జనాభా వివరాలు ఉపయోగపడతాయి. ఈ దిశగా దేశ వ్యాప్తంగా బీసీలు ఉద్యమించి, మండల్‌ కమిషన్‌లో సాధించుకోలేని అంశాలను హక్కుగా పొందేందుకు అవకాశం వచ్చింది.  ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం 50 శాతం బీసీలకు 24 శాతం in రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్ని ఆ సామాజిక అన్యాయం ఎన్నికలు గానే భావించి బీసీ సోదరులంతా తమ నిరసనను పలు రూపాల్లో వ్యక్తం చేయాలి. జనాభా గణన అయిపోయింది కాబట్టి, బీసీ జనాభా ప్రకారంగానే, అదే కోర్టులు కొట్టివేయలేని శాస్త్రీయ ప్రాతిపదిక అవుతుంది కాబట్టి, త్వరలో ముందుగా జనాభాలో కులాల దామాషాను ప్రకటించి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి.  50 శాతం బీసీ జనాభాకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే పక్షంలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్ళాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాను.