BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

రైతుల సమస్యల్లో వెంటనే పరిష్కరించండి...

Select Suryaa Now
రైతుల సమస్యల్లో వెంటనే పరిష్కరించండి...

 రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో కొంగర ఖుర్ద్ ఏ రైతుల ఫిర్యాదులపై ఆర్డీఓనునియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములుతో కలసి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేశ్వరం మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్ ఏ ప్రాంతంలో వక్ఫ్ భూములకు సంబంధించిన సమస్యపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని  కోరారు. కొంగర ఖుర్ద్ ప్రాంతంలో సుమారు *500 ఎకరాల వక్ఫ్ భూమి* ఉందని, అందులో *సర్వే నంబర్లు 85, 86, 88, 89లకు సంబంధించి సుమారు 58 ఎకరాల భూమిపై* కొందరు రియల్టర్లు అక్రమ లేఅవుట్లు వేస్తున్నారంటూ రైతులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు తెలియకుండా భూ లావాదేవీలు, లేఅవుట్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత భూములు *నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ లేఅవుట్లకు అనుమతులు ఎలా వచ్చాయనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని* వారు కోరారు. 
రైతుల ఫిర్యాదులను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లిన *కొండా విశ్వేశ్వర్ రెడ్డి , భూముల హక్కులు, రికార్డులు, అనుమతులు తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు. భూములపై జారీ అయిన 10 ఓఆర్‌సీలపై కూడా విచారణ చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను నిలిపివేయాలని ఆర్డీఓ ని కోరారు.నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు జరుగుతున్నట్లు తేలితే వెంటనే పనులను నిలిపివేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై హెచ్ఎండిఏ కమిషనర్‌కు కూడా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని* ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.రైతుల భూములు, ప్రభుత్వ రికార్డుల పరిరక్షణ విషయంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి , మాజీ జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి , మండల అధ్యక్షులు, సంబంధిత రైతులు, మాజీ తుక్కుగూడ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 

మేజర్ న్యూస్, 
_________________________