BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

ఆత్మకూరు యూపీహెచ్సి పరిధిలో సేవా సంకల్ప అభియాన్ విజయవంతం

Select Suryaa Now
ఆత్మకూరు యూపీహెచ్సి పరిధిలో సేవా సంకల్ప అభియాన్ విజయవంతం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులోని యూపీహెచ్ సి  పరిధిలో సేవా సంకల్ప అభియాన్  కార్యక్రమాన్ని వైద్యాధికారిణి డాక్టర్ సాయి ప్రసన్న  ఆధ్వర్యంలో  విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు మరియు అవసరమైన చికిత్సలు అందించారు. గర్భిణీలకు ఏ ఎన్ సి పరీక్షలు, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, హిమోగ్లోబిన్ పరీక్షలు, రక్తపోటు , మధుమేహం  తదితర ఆరోగ్య సమస్యలపై స్క్రీనింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఊబకాయం పరీక్షలు, పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణపై కౌన్సెలింగ్, తక్కువ ఉప్పు–తక్కువ నూనె–తక్కువ చక్కెర ఆహారంపై అవగాహన, టెలి - మనస్ సేవలపై సమాచారం, కిశోర బాలికలకు మాసిక పరిశుభ్రతపై అవగాహన వంటి పలు ఆరోగ్య సేవలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ రజాక్  పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి తగిన చికిత్స, ఆరోగ్య సూచనలు అందించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో హెచ్ ఈ వో  ఎస్. సుధాకర్ , హెచ్ బి  పార్వతి , హెల్త్ అసిస్టెంట్ శ్రీరాములు,  సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు లు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను వారి పరిధిలోనే అందుబాటులోకి తీసుకురావడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు. సేవా సంకల్ప అభియాన్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన మరియు అవసరమైన చికిత్సలు అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.