BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి.

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి.

పెద్ద శంకరంపేట ; అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం పెద్ద శంకరంపేట లోని రైతు వేదికలో పెద్ద శంకరంపేట తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండల పరిధిలోని కొత్తపేట రామోజీ పల్లి గ్రామాలలో నూతనంగా నిర్వహించిన మహిళ సమైక్య భవనాలను ప్రారంభించారు.  పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ప్రజలకు అవసరమైన పౌర సేవలు సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు మహిళా సమైక్య సంఘాల బలోపేతానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతూ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.                    గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు.గ్రామాలలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారులకు సూపించారు. ఎల్ ని నో దృష్ట్యా నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున గ్రామాలలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని.. గ్రామాలలో పాత బోర్లను ఫ్లెషింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు.. గ్రామాలలో విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే తొందరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ కి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జగదీష్. హౌసింగ్ ది విజయ. తాసిల్దార్ నారాయణ ఎంపీడీవో షాకీర్ అలీ.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్ మురళి పంతులు. మధు ..  సంగమేశ్వర్. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లు గౌడ్. ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..