వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం
పెంటపాడు, మేజర్ న్యూస్; పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలోని బైరాగి మఠంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం, ఆంజనేయస్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన వడ్డి రఘురామ్ నాయుడు కి ఆలయ ఈవో చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం లో వడ్డి రఘురామ్ నాయుడు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి వడ్డి రఘురామ్ నాయుడు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లి గూడెం