BREAKING
అమెరికాలో ఊహించని రీతిలో పెరిగిన నిర్మాణ రంగ వ్యయాలు అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు

పెన్షన్స్ పంపిణీకి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం --కేతా

Select Suryaa Now
పెన్షన్స్ పంపిణీకి  కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం  --కేతా

      ఆత్మకూరు, మేజర్ న్యూస్  :  ప్రతి నెల ఒకటో తేదీ క్రమం తప్పకుండా వృద్దులు, వికలాంగులు,వితంతువులు తదితరులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానిదేనని ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వారం  ఆయన మండలంలోని చెర్లో యడవల్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందితోపాటు ఆయన పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాము పెన్షన్ పంపిణీ  కార్యక్రమంలో పాల్గొన్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా 1వతేదీ పెన్షన్ దారులు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకటో తేదీ సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్ అందజేస్తున్నామని విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకటో తేదీ తెల్లారేసరికల్లా పెన్షనర్ల చేతిలో పెన్షన్ మొత్తాన్ని అందజేస్తుండగా వారి సంతోషాలకు అవధులు లేకుండా ఉందని కేతా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పెన్షన్ 4000, 6000, 10000, 15000 వంతున పెంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దనే ఒకటో తేదీ అందజేస్తున్నామని  పేర్కొన్నారు. పెన్షనర్ల సంతోషానికి అవధుల్లేకుండా పండుగ వాతావరణం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం  కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.