BREAKING
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి. రైతుల సమస్యల్లో వెంటనే పరిష్కరించండి... ఆత్మకూరు యూపీహెచ్సి పరిధిలో సేవా సంకల్ప అభియాన్ విజయవంతం వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ బూటకం ఇదొక రాజకీయ డ్రామా *తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం

ఫ్రాన్స్‌లో ఉప్పొంగుతున్న విద్యార్థి నిరసనలు

Select Suryaa Now
ఫ్రాన్స్‌లో ఉప్పొంగుతున్న విద్యార్థి నిరసనలు

సూర్య అంతర్జాతీయ డెస్క్: ఫ్రాన్స్‌లో ప్రభుత్వ విద్యా విధానాలు, ఉపాధ్యాయుల కొరత మరియు శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య గురువారం జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. మార్సెయిల్ నగరంలోని విక్టర్ హ్యూగో ఉన్నత పాఠశాలలోకి చొరబడిన దుండగులు హెచ్‌‌టెండర్ (ప్రధానోపాధ్యాయుడు)పై పెట్రోల్ పోసి నిప్పుంటించేందుకు ప్రయత్నించడంతో ఆయన గాయపడ్డారు. అదే నగరంలోని సెయింట్-ఎక్సుపెరీ హైస్కూల్ వద్ద మంటలనుార్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాన్ని వందలాది మంది ఆందోళనకారులు అడ్డుకుని, సిబ్బందిని తరిమికొట్టి వాహనానికి నిప్పుపెట్టారు. పశ్చిమ నగరమైన నాంట్సెలోనూ మరో పాఠశాలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, తరగతి గదుల్లో కిక్కిరిసిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్‌‌లో విద్యార్థులు ఉద్యమం చేపడుతున్నారు. ఈ నిరసనలు క్రమంగా ఉద్రిక్తతలకు దారితీస్తుండటంతో దేశవ్యాప్తంగా వందలాది మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ కోతలు మరియు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల వేతనాలస్తంభనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్ కార్మికులు కూడా నిరసన బాటపట్టారు. హింసాత్మక ఘటనలను ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, పాఠశాలల వద్ద జరుగుతున్న అల్లర్లు దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.