BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

నిబంధనల ప్రకారమే క్వార్టర్ ఖాళీ చేయించాం - బి-40 వ్యవహారంతో మంత్రికి సంబంధం లేదు - సింగరేణి జీఎం ఎన్. రాధాకృష్ణ స్పష్టీకరణ

Select Suryaa Now
నిబంధనల ప్రకారమే క్వార్టర్ ఖాళీ చేయించాం - బి-40 వ్యవహారంతో మంత్రికి సంబంధం లేదు - సింగరేణి జీఎం ఎన్. రాధాకృష్ణ స్పష్టీకరణ
సూర్య, మందమర్రి, సింగరేణి సంస్థకు చెందిన బి-40 క్వార్టర్‌ను ఖాళీ చేయించిన ప్రక్రియ సంస్థ నిబంధనలు, విజిలెన్స్ నివేదిక, చట్టబద్ధమైన విధానాల ప్రకారమే చేపట్టినట్లు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సమావేశంలో జిఎం మాట్లాడుతూ ఈ వ్యవహారానికి స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామికి గానీ, రాజకీయాలకు గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. బి-40 క్వార్టర్ కేటాయింపుపై విచారణ చేపట్టగా, మద్ది శంకర్ అనే వ్యక్తి అందులో అనధికారికంగా నివసిస్తున్నట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైందని జీఎం తెలిపారు. మంత్రికి ఇప్పటికే బి-1 క్వార్టర్‌ను క్యాంపు కార్యాలయంగా అధికారికంగా కేటాయించామని, బి-40 క్వార్టర్‌ను వివేక్‌కు కేటాయించలేదని వివరించారు. క్వార్టర్ ఖాళీ చేయించాలని తొలుత మద్దిశంకర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చామని, జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా మూడుసార్లు తెలుగులో నోటీసులు అందించామని తెలిపారు. జూలై 27న పర్సనల్ విభాగం ద్వారా మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ క్వార్టర్ ఖాళీ చేయకపోవడంతో, ఎవిక్షన్ ప్రక్రియలో భాగంగా ఫారమ్‌-ఎ, ఫారమ్‌-బి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్‌ అండ్‌ పీసీ విభాగం, పోలీసు శాఖ, ఎస్టేట్ అధికారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య, భద్రత మధ్య సామగ్రి తరలింపు, క్వార్టర్‌ను ఖాళీ చేయించినట్లు జీఎం వెల్లడించారు. మద్దిశంకర్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన రాకపోవడంతో లోపల ఉన్న సామగ్రిని భద్రంగా తరలించి సురక్షిత ప్రాంతంలో ఉంచినట్లు తెలిపారు. అనంతరం ఆ క్వార్టర్‌ను మరో సింగరేణి ఉద్యోగికి కేటాయించినట్లు పేర్కొన్నారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని, దీనికి కులం, రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. సంస్థ నిబంధనల ప్రకారం జరిగిన ప్రక్రియకు మంత్రిని బాధ్యుడిగా చేస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని, వాస్తవాలను గుర్తించాలని ప్రజలకు జిఎం విజ్ఞప్తి చేశారు.