BREAKING
గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకులు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం థియేటర్లలో శర్వానంద్ ‘భోగి’: సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే? నాన్న కుట్టి మూవీ రివ్యూ: విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందంటే? పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? సూపర్ మార్కెట్ షాపింగ్ ఇక మీ చేతిలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్ మరియు టెర్రాన్ ఈవీ స్కూటర్ల ప్రారంభం యథార్థ సంఘటనల ఆధారంగా ‘కూల్ రాఖీ కూల్’: ఘనంగా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’: సక్సెస్ మీట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న చిత్ర బృందం స్ఫూర్తి.. (కథ) కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. ఎన్నికల అధికారికి కుడి చేయి విరగడంతో కలకలం. రామగిరి సర్పంచిగా బెస్త ఆదిలక్ష్మి ఘనవిజయం కరీంనగర్‌లో అక్షర–అలెన్ జేఈఈ, నీట్ కోచింగ్ ప్రారంభం మార్లమడికి గ్రామ సర్పంచ్ రాలిగా లక్ష్మి అభినందనలు శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ పెద్ద గోనెహాలు గ్రామ సర్పంచ్ రాలిగా గెలిచిన రెడ్డి గారి లక్ష్మి అభినందనలు కుందుర్పి మండలం ఎనుములతోటిలో పోలీసులపై దాడి.

ఘనంగా జెమిని సురేష్ ఆత్మకథ ఆడియో లాంచ్.. హనుమాన్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభం

Select Suryaa Now
ఘనంగా జెమిని సురేష్ ఆత్మకథ ఆడియో లాంచ్.. హనుమాన్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభం

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో చిన్న సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కొత్తగా హనుమాన్ మ్యూజిక్ ఆడియో లేబుల్ లాంచ్ చేయబడింది. వారాహి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సోమేష్ నిర్మాతగా, శ్రీనివాస్ గుండ్రెడ్డి రచనా దర్శకత్వంలో తెరకెక్కిన ఆత్మకథ యాన్ అన్ టోల్డ్ స్టోరీ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ హాస్యనటుడు, నటుడు జెమిని సురేష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా, రూప హీరోయిన్‌గా నటించారు. ఈ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు ముఖ్య అతితులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో హనుమాన్ మ్యూజిక్ లేబుల్‌ను అధికారికంగా ప్రారంభించడంతో పాటు, ఈ లేబుల్ ద్వారా మొదటిగా ఆత్మకథ చిత్రంలోని పాటలను అతిధుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మ్యూజిక్ ఎండీ అవినాష్ కూనపరెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలకు, నూతన టాలెంట్‌కు ఈ ఆడియో సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి తెరకెక్కించిన ఈ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, అన్ని భాషలలో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సినిమాలో నటించిన సమ్మెట గాంధీ, నాగ మహేష్‌తో పాటు ఇతర నటీనటులు తమ అనుభవాలను పంచుకుంటూ సినిమా విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. హీరోగా తన కల నెరవేరిందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి పెద్ద హిట్ చేయాలని జెమిని సురేష్ కోరారు. చిత్రానికి సంగీతం అందించిన శ్రేయాంశ్ పనితీరును అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో ఈ ఆడియో వేడుక సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.