BREAKING
ఆత్మకూరు యూపీహెచ్సి పరిధిలో సేవా సంకల్ప అభియాన్ విజయవంతం వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ బూటకం ఇదొక రాజకీయ డ్రామా *తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి..

రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ... ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ... ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

సూర్య బాన్సువాడ,రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బాన్సువాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ సొసైటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో, బుడ్మి సొసైటీ పరిధిలోని తాడకోల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరి ధాన్యం కోతలు ఇతర జిల్లాలతో పోలిస్తే ముందుగానే ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,461, కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ.2,441 చొప్పున కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, పొల్లు లేకుండా, తేమ శాతం 17 శాతంలోపు ఉండేలా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.