విద్యార్థి అవ్వ తాతలను సన్మానించిన మండల విద్యాశాఖ అధికారి!
పుంగనూరు :
మండల పరిధిలోని గూడూరు పల్లి ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి గౌతమ్ గతంలో 400 మీటర్ల పరుగుపందెం నందు స్టేట్ లెవెల్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి, ప్రస్తుతం నేషనల్ లెవెల్ శిక్షణ నిమిత్తం ఏలూరు జిల్లా హీల్ స్కూల్ కి వెళ్లడం జరిగింది. ఆ విద్యార్థి సంరక్షకులు అయినా అవ్వ, తాత లు పాపులమ్మ,నారాయణప్పలను గురువారం శ్యాలవతో సన్మానించారు .ప్రభుత్వం తరఫున సమగ్ర శిక్ష ద్వారా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ బృందం ప్రోత్సాహక బహుమతిగా 1500 రూపాయలు వితరణ చేశారు. ఈ మొత్తాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి జి నటరాజ రెడ్డి చేతుల మీదుగా వారి సంరక్షకులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రఘునాథ్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పర్సన్స్ వెంకటరమణ,అరుణ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.