BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వత్సవాయి మండలంలో రూ.1.41 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
వత్సవాయి మండలంలో రూ.1.41 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వత్సవాయి మేజర్ న్యూస్ :- మండలంలోని పలు గ్రామాల్లో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.41 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్  (తాతయ్య)శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణ పనులను గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.మండలంలోని మంగొల్లు గ్రామంలో రూ.56 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం వత్సవాయి గ్రామంలో రూ.65 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కంభంపాడు గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం మూడు గ్రామాల్లో రూ.1.41 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్  (తాతయ్య)మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని, వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పశుపోషకులకు గోకులం షెడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. పశువులను రక్షించుకోవడంతో పాటు వాటికి అవసరమైన వసతులు కల్పించేందుకు గోకులం షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత ప్రమాణాల మేరకు పనులు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల అమలులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని శ్రీరాం రాజగోపాల్  (తాతయ్య)తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అవసరమైన చోట మరిన్ని నిధులు మంజూరు చేయించి పనులు చేపడతామని తెలిపారు.అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించి అవసరమైన పనులను దశలవారీగా చేపట్టాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో వత్సవాయి మండల టీడీపీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.