BREAKING
ఎమ్మిగనూరు వైసీపీలో మినహాయింపులు కొందరికి నా..? సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టారు -బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన దక్షిణాఫ్రికా! సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి 26వ డివిజన్‌ నుంచి బైక్‌ ర్యాలీ మలేషియా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పన ఇటలీలో పడిపోయిన వ్యాపార, వినియోగదారుల విశ్వాసం కేంద్ర సిఇసి రాజీనామా చేయాలి -తక్షణం ఆయన రాజీనామా చేయాలని -తిరుపతిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ 'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం

Select Suryaa Now
శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం

శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి బంగారు పూత పూసిన గజ వాహనం, సింహ వాహనాలను దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు  బుధవారం ఆలయ వాహన మండపం వద్ద ఈ వాహనాలను దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన పి.వి.లక్ష్మీ రెడ్డి సింహ వాహనాన్ని, పి.వి. దివ్య ప్రియాంక గజ వాహనాన్ని ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మీకి అందజేశారు. సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత పూసిన ఈ రెండు వాహనాలను దాతలు సమర్పించారు. ఈ రెండు వాహనాలను స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా వాహన మండపంలో గజ వాహనం, సింహ వాహనాలకు ఆలయ అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి సేవకు వాహనాలను సమర్పించడం పట్ల దాతలు భక్తి, ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం దాతలకు శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించి, స్వామివారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ దీక్షితులు, నారాయణ చార్యులు, ఇతర అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి