BREAKING
'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో వైష్ణవికి స్వర్ణ పతకం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దసరా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అక్రమ మట్టి తవ్వకాలను ఉపేక్షించేది లేదు.... సీఈసీని అరెస్టు చేయాలి..సిపిఐ డిమాండ్ ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌పై తప్పుడు ప్రచారంపై ఫిర్యాదులు నంద్యాలలో జిల్లా పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా రాచవారిపాలెం వద్ద విషాద ఘటన.. గొర్రెలు కాస్తున్న 8 ఏళ్ల బాలుడి దీనస్థితి షాద్‌నగర్‌లో కలకలం.. కళాశాలకు వెళ్లి అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని

ఆ రోజుల్లో బాగుండేవి!

Select Suryaa Now
ఆ రోజుల్లో బాగుండేవి!

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1వ తేదీన మనం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ఈ దినోత్సవాన్ని 1990లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వృద్ధుల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య మరియు సాంస్కృతిక అవసరాలను గుర్తించి, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఈ రోజుల్లో వృద్ధుల నోట, ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట “ఆ (మా) రోజులే బాగుండేవి” అని. నిజమే ఈ మాటలు అక్షర సత్యం కూడా. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యము, వృద్ధాప్యము రెండూ అద్భుతమైనవి, సాటిలేనివి కూడా. బాల్యము లేతదనానికి, వృద్ధాప్యం పరిపక్వతకు చిహ్నాలు. బాల్యం అమాయకత్వానికి, వృద్ధాప్యం అనుభవసారానికి ప్రతీకలు.

ఉమ్మడి కుటుంబాలు ఉన్న పూర్వపు రోజుల్లో అది పట్టణమైనా, పల్లె అయినా తల్లి, తండ్రి, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అందరూ కలిసి కష్టసుఖాలను ఒక గూటికింద పంచుకునేవారు. ఇంటి పెద్దలుగా తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు ఉండేవి, నిర్ణయాధికారం తండ్రికి ఉండేది. తల్లికి ఇంటి పనులు, బంధువులు, ఊళ్ళు, పుణ్యాలు ఇలా జీవితం సాఫీగా సాగిపోయేది.

అప్పట్లో వారు శారీరక శ్రమ చేసే వారు. అందుకు తగ్గ తిండి తినేవారు. 60, 70 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు. వయసు మీద పడ్డాక, ఇక ఎంతో కాలం బతకలేము అనే విషయం వారికే తెలిసేది. ఆ సమయం రాగానే తృప్తిగా కన్నుమూసేవారు.

మరి ఇప్పడు స్పీడ్‌! స్పీడ్‌!! టెన్షన్‌! టెన్షన్‌!! భార్యా భర్తల ఉద్యోగాలు, పిల్లల చదువులు... ఈ యాంత్రిక జీవితంలో పెద్దలను పట్టించుకునే తీరిక, ఓపిక పిల్లలకు ఉండడం లేదు. నాన్నా! మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్లాలి, ఇంట్లో మిమ్మల్ని చూసుకునేది ఎవరు? ఏ తోడు లేకుండా మీరిద్దరే ఉండడం కష్టం అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చించే పిల్లలు కొందరైతే, తాము ఉద్యోగాలకు వెళ్తే కేవలం పిల్లల సంరక్షణ చూసుకోవడానికి తల్లిదండ్రులను తమ వద్ద పెట్టుకుని, అవసరం తీరాక వాళ్ళను వృద్ధాశ్రమాల్లో చేర్చించే పిల్లలు మరికొందరు.

కారణాలు ఏవైతేనేం ఈ రోజుల్లో తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు పిల్లలు. అందుకు నిదర్శనం ఇప్పుడు పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలే. ఇది పిల్లలతో కలిసి ఉంటున్న వృద్ధులది మరొకరకమైన వేదన. కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు, నిర్లక్ష్యపు ప్రవర్తన వంటివి గమనించి కూడా వారు మౌనంగా భరిస్తున్నారు. కారణం పిల్లలనే మమకారం కావచ్చు, లేదా విడిగా బ్రతకలేని పరాధీనత కావచ్చు.

ఇక ముగ్గురు, నలుగురు సంతానం మరి కొన్ని కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటోందంటే తల్లిదండ్రులను ఒక్కొక్కరు మూడు లేదా నాలుగు నెలలు పోషించేటట్టు ఒప్పందం చేసుకోవడం. ఈ పంపకాల పద్ధతి వృద్ధులను మరింత వేదనకు గురి చేస్తోంది. మరికొందరు పిల్లలేమో అనారోగ్యంతో బాధపడే నాన్నని చూసుకోవడం కన్నా ఆరోగ్యంతో ఉన్న అమ్మని చూసుకుంటే తమకో, పిల్లలకో ఆసరాగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా పిల్లలు వాళ్ళ, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అమ్మ, నాన్నలను పంచుకోవడం కూడా చూస్తున్నాం.

60, 70 ఏళ్ళు పైబడిన తర్వాత కష్టమో, సుఖమో భార్యా, భర్తలిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటారు. “ఈ తరం పిల్లలది తీరికలేని జీవితం, ఆర్థికంగా కానీ, ఇతరత్రా పరిస్థితుల దృష్ట్యా కానీ తమను చూసుకోలేకపోయినా పరవాలేదు” కానీ, ఈ వయసులో తమను విడదీయడం, భార్య భర్తలిద్దరం చెరోచోట ఉండాల్సిరావటం మమ్మల్ని మానసికంగా మరింత కృంగదీస్తోంది అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు.

ఇలా కారణాలు ఏవైనా నేటి సమాజంలో వృద్ధుల పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు భరించాలి? ఈ ప్రాణం ఎప్పుడు పోతుందా? అనుకుంటూ తమలో తామే కుమిలిపోతూ, క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదు.

ఇక ఆస్తి ఉంటే మరో సమస్య. ఈ పెద్దాయన ఉన్న ఆస్తి ఎవరికైనా రాస్తాడేమో, ఏ క్షణాన కన్నుమూస్తాడో అనుకుని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే సంతానం కూడా లేకపోలేదు.

ఇక వీటన్నింటికీ తోడు వృద్ధులు తట్టుకోలేకపోతున్న మరో అంశం, పెద్దవారిగా వారిని గౌరవించకపోవడం. కుటుంబ పెద్దగా భావించకపోవడం. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం. సలహాలు ఇచ్చినా తమవాళ్లు పాటించకపోవడం... ఉదాహరణకి తీసిన వస్తువు తీసిన చోట పెట్టాలిరా అన్నారనుకోండి, అబ్బా! నీ చాదస్తంతో చచ్చిపోతున్నాం అంటూ వారిని విసుక్కోవడం మొదలైనవి.

పెద్దలపట్ల తమ అమ్మ, నాన్నలు అనుసరించిన తీరునే పిల్లలు ఆచరిస్తారు. వారు కూడా తమ తాత, బామ్మలను నిర్లక్ష్యం చేయడం, విసుక్కోవడం వంటివి కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నవే.