నంద్యాలలో ఘనంగా యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలు
నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రం నందు బుధవారం యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.యోగా రంగానికి రాపర్తి రామారావు అందించిన సేవలు, సమాజంలో యోగా ప్రాధాన్యతను విస్తరించేందుకు చేసిన కృషి గురించి ఆయన శిష్యులు వివరించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాఘం వెంకటేశ్వర్లు,భవనాశి వాసు,భవనాశి మహేష్,యోగ శిక్షకుడు జగన్ మోహన్ రెడ్డి,యోగ చైతన్య కేంద్రం సభ్యులు, యోగా సాధకులు పాల్గొన్నారు.