ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
సూర్య ఎండపల్లి:మండలంలోని వివిధ ఎరువులు, పురుగు మందుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి కామళ్ల మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న ఎరువులు, పురుగు మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు నిల్వ రిజిస్టర్లు, విక్రయ బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. ప్రతి విక్రయానికి రైతులకు తప్పనిసరిగా బిల్లు అందించాలని స్పష్టం చేశారు. అనుమతి లేని కంపెనీల ఉత్పత్తులను నిల్వ ఉంచినా, లైసెన్సులో నమోదు కాని కంపెనీల ఉత్పత్తులను విక్రయించినా, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు జరిపినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.