BREAKING
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి* మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. సేవా సంకల్ప్ అభియాన్ మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభం మరింత అభివృద్ధి, ప్రజాసేవే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

పాత్రికేయులే ప్రగతికి వారదులు.....

Select Suryaa Now
పాత్రికేయులే ప్రగతికి వారదులు.....

 

*ఇప్పుడు సామాజిక సేవలోను భాగస్వాములు..*

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందనలు..*  

పాత్రికేయులే ప్రగతికి వారధులుగా తమ వార్తల ద్వారా సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని, ఇప్పుడు సామాజిక సేవల ద్వారా కూడా మరో అడుగు ముందుకు వేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు. షాద్ నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో నిరుపేద పిల్లల పాఠశాల భూమి పూజ కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల గురించి ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చి, అభివృద్ధికి తమ అక్షరం ద్వారా చేయూతను అందించే పాత్రికేయులు నిరుపేద పిల్లల కోసం ముందుకు వచ్చి రూం.3.50 లక్షలు విరాళంగా ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది తెలంగాణలో ఎక్కడా లేదని, ఇక్కడ మాత్రమే సాధ్యమైందని అభినందించారు. గతంలో కళాశాల నిర్మాణానికి కూడా పాత్రికేయులు సహకరించారని, భవిష్యత్తులోనూ వారి నుంచి మరిన్ని సేవా కార్యక్రమాలు ఆశిస్తున్నామని వెల్లడించారు.

*సొంత జేబులోంచి ఖర్చు పెట్టే ఎమ్మెల్యే - జర్నలిస్ట్ కేపీ*

ఎమ్మెల్యేలు పనులు చేయాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి.. అక్కడి నుంచి నిధులు రావాలి.. కానీ అత్యవసర సమయాల్లో అవేవీ పట్టించుకోకుండా తన జేబులో నుంచి డబ్బులు తీసి పనిచేసే ఎమ్మెల్యేను తన జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానని జర్నలిస్టు కేపీ అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకరుడు ఇప్పటిదాకా శ్రీశైలంలో మాత్రమే ఉంటాడని అనుకున్నానని, కానీ షాద్ నగర్ లో కూడా సాక్షాత్తు శ్రీశైల శంకరుడే ఉన్నాడని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఉద్దేశించి విద్యాభివృద్ధి విషయంలో పేర్కొన్నారు. ఎండాకాలంలో ఐస్క్రీమ్ ఎవరైనా తింటారు.. కానీ వర్షాకాలంలో తినడమే గొప్ప విషయం.. అలా కాలంతో సంబంధం లేకుండా తన పని తాను సాసోపేతంగా చేసుకునే ఎమ్మెల్యే అని అభినందించారు. పేద పిల్లల చదువు గురించి ఆలోచించి ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తే సమయం పడుతుందని తానే స్వయంగా కంకణం కట్టుకొని త్వరగా పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు సాగడం సంతోషకరమన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు గర్వపడుతున్నామని, ఆయనకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

*అక్షరానికి సారధి.. వారధి ఎమ్మెల్యే*

*:- లట్టుపల్లి మోహన్ రెడ్డి*

అక్షరానికి సారధిగా.. వారధిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముందడుగు వేస్తున్న తీరు అభినందనీయమని సీనియర్ పాత్రికేయుడు లట్టుపల్లి మోహన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలపై దృష్టి పెట్టి ఆ కళాశాలను సొంత నిధులతో అభివృద్ధి చేయడమే కాకుండా, ఫరూక్ నగర్, మొగలిగిద్ద, నందిగామ తదితర పాఠశాలలకు నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇప్పుడు నిరుపేద పిల్లల కోసం పాఠశాల నిర్మాణానికి పూనుకొని మరో అడుగు ముందుకు వేయడం, ఇందులో పాత్రికేయులను కూడా భాగస్వామ్యం చేయడం సంతోషకరమని అన్నారు. అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

జవాజి రాఘవేంద్ర గౌడ్, మేజర్ న్యూస్ షాద్ నగర్