అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయుడు-నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
-నూనెపల్లె అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
-సమస్య మీది కాదు నాది పరిష్కారం అయ్యేంత వరకు వదలను.
-ఈరోజే మీ సమస్య పై అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
-గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వం నూనెపల్లె అభివృద్ధిని విస్మరించింది
-ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీతో నూనెపల్లె అభివృద్ధి కమిటీ దీక్ష విరమణ.
నంద్యాల అర్బన్: అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, నూనెపల్లె వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అవసరమైన నిధుల విడుదలకు పరిపాలన అనుమతి తీసుకున్నానని, నూనెపల్లె అభివృద్ధి విషయంలో మా మంచి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్య మీది కాదు నాది వాటిని పరిష్కరించెంత వరకు వదిలేదని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంపీ బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. నూనెపల్లె అభివృద్ధి కమిటీ పేరుతో సీనియర్ న్యాయవాది బి. శంకరయ్య ఆధ్వర్యంలో నూనెపల్లి వద్ద రైల్వే అండర్ పాస్ వంతెన ఏర్పాటు చేయాలని రెండు రోజులుగా సామూహిక దీక్ష చేస్తున్నారు. బుధవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నూనెపల్లిలోని దీక్ష శిబిరం కు వచ్చి నూనెపల్లె అభివృద్ధికి, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కు ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని విషయాలు వివరించారు. తాను, మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ నూనెపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కోసం ఇప్పటి వరకు చేసిన, చేపట్టబోయే అంశాలను నూనెపల్లె అభివృద్ధి కమిటీకి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. ఈ రోజే మరి కొద్దిసేపట్లో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన రైల్వే, మున్సిపల్, రెవిన్యూ, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖల అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసి, వాటి సమాచారం రేపటి లోగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు మీ సమస్య పరిష్కారం కోసం పైల్ వెళుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. చిన్న ఉద్యమం అయినా ఎంపీ డాక్టర్ శబరి వచ్చారన్నారు. ఇది చిన్నది కాదు, మీ కష్టం నాకు తెలుసు
ఇదేళ్లు వైసీపీ పట్టించుకోలేదు. మీ బిడ్డగా తాను ఎంపీ అయిన రెండు నెలలకే ఢిల్లీలో
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ దృష్టికి రెండేళ్ల క్రితం తీసుకొల్లా,
సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలనీ కేంద్ర రైల్వే మంత్రి నీ, సీఎం చంద్రబాబునాయుడును కోరా అన్నారు. ఎంపీ గా తాను,
మంత్రి ఫరూక్, నంద్యాల జిల్లా
కలెక్టర్ బాగా స్పందించాం. ఈ రోజు అన్ని శాఖల అధికారుల సమావేశం ఏర్పాటు కు
సీఎం చంద్రబాబు స్పందించారు
రేపటి లోగా సీఎం ఆఫీస్ కు వెళుతుంది.
మంత్రి ఫరూక్ నేను కలిసి మీ సమస్య పరిష్కరిస్తాం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా నూనెపల్లె అభివృద్ధి కమిటీ పేరుతో చేస్తున్న
మీ ఐక్యతకు అభినందనలనీ,
మీ సహకారం మా ఉమ్మడి ప్రభుత్వం కు ఎంతో అవసరం.
పని కానప్పుడు దీక్షచేద్దాం.
మీది కాదు ఇది నా బాధ్యత మీరూ దీక్ష విరమణ చేయండని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరగానే ఒక్కసారిగా వందలాది మంది నూనెపల్లె ప్రజలు, ఉద్యమకారులు హర్ష ధ్వనాలతో ఆహ్వానించి, దీక్ష విరమించారు. దీక్ష శిబిరం నుంచి పక్కనే ఉన్న నూనెపల్లె రైల్వే అండర్ పాస్ వంతెన అవసరం అయ్యో రైల్వే ట్రాక్ ను ఉద్యమకారులతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరిశీలించారు.