కళ్యాణ్ లక్ష్మి, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే
కళ్యాణ లక్ష్మి చెక్కులు,స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
దుమ్ముగూడెం, సూర్య న్యూస్,(కల్లూరి సుమన్)::
మండల పరిధిలోని లక్ష్మీనగరం ఎంపీడీవో కార్యాలయంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు చేతులమీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు, తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అందిస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, భద్రాచలం నియోజవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అశోక్ కుమార్ ఎంపీడీవో వివేక్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్లం హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బులు సత్యాలు సాంబశివరావు పిలక వెంకటరమణ రెడ్డి సర్పంచులు మట్ట వెంకటేశ్వరరావు బొడియం సుబ్బారావు రవి శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.