పాఠశాలల కాంపౌండ్ వాల్స్‌కు రూ.8 కోట్ల CSR నిధులు ఇవ్వండి* *HPCL RMను కోరిన మంత్రి సవిత*
పెనుకొండ…సెప్టెంబర్ 30
పెనుకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్ నిర్మించేందుకు రూ.8 కోట్ల CSR నిధులు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత HPCL అధికారులను కోరారు. కడపలోని R&B గెస్ట్‌హౌస్‌లో బుధవారం HPCL RM మన్మదరావు మంత్రి సవితను కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి CSR నిధులు మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు కాంపౌండ్ వాల్స్ అవసరమని ఆమె వివరించారు. దీనిపై HPCL అధికారులు సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని తెలిపారు.