BREAKING
*అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టిసి వరుణ్ అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గాంధీ జయంతి వేడుకలకు ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు

Select Suryaa Now
గాంధీ జయంతి వేడుకలకు ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :- మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లో PRIDE ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక వేడుకలకు జగ్గయ్యపేట జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ ప్లస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అభినందనలు తెలిపారు.

పాఠశాలకు చెందిన పీఎస్ ఉపాధ్యాయుడు గార్లపాటి చంద్రశేఖర్‌తో పాటు విద్యార్థులు వై. భార్గవ్ ధనుష్, ఎం. నాగతేజ ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. హేమమాధవి, ఉపాధ్యాయులు బి. కరుణాకర్ రెడ్డి, గింజుపల్లి కృష్ణ తదితరులు ఎంపికైన ఉపాధ్యాయుడు, విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లో నిర్వహించనున్న మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.