BREAKING
విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పరిశీలన 60 లక్షల వ్యయం తో ముస్లిం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి పూజ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం కోటపాటి జనార్దన్‌రావు వదిన మృతి మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్ విద్యుత్ కోతలపై బిజెపి నిరసన అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం పౌర హక్కులపై అవగాహన అవసరం పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం నంద్యాలలో ఘనంగా యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలు టాస్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో బాగుండేవి!

అనంతపురం నగరంలో రూ.2.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Select Suryaa Now
అనంతపురం నగరంలో రూ.2.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

అనంతపురం బ్యూరో 

నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఒకే రోజు రూ.2.66 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, టీడీపీ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

టవర్‌క్లాక్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు రూ.1.12 కోట్లతో ఫుట్‌పాత్‌, రోడ్డు పనులు, రాజా, రమణ, రమేష్‌ థియేటర్‌ వద్ద రూ.60 లక్షలతో బాక్స్‌ కల్వర్టు, లక్ష్మీనగర్‌లో రూ.60 లక్షలతో మైనార్టీ కమిటీ హాల్‌కు భూమిపూజ చేశారు. అలాగే పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులకు శ్రీకారం చుట్టారు.

ఇటీవల రూ.107.71 కోట్లతో తాగునీరు, వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభించామని, హెచ్‌ఏఎం పథకం కింద రూ.50 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే నెలలో మరో రూ.160 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతామని పేర్కొన్నారు. అనంతపురం నగర అభివృద్ధికి ప్రభుత్వం సహకారంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ తెలిపారు.