నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారి, డాక్టర్ తుకారం రాథోడ్.
దుమ్ముగూడెం, సూర్య ప్రతినిధి, (కల్లూరి సుమన్)::
మండల పరిధిలోని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి తుకారం రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫార్మసీ ల్యాబ్ రికార్డులను ఆయన పరిశీలించారు, అలాగే హైరిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక నిఘా ఉండాలని, సిబ్బందికి పలు సూచనలు చేశారు, అనంతరం వార్డులో ఉన్న, రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు, ఆ తరువాత సిబ్బందితో, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, అవేర్నెస్ చేశారు. అనంతరం మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఏకలవ్య స్కూల్ ని సందర్శించారు, అక్కడి విద్యార్థులతో, ఈరోజు ప్రపంచ హార్ట్ దినోత్సవ సందర్భంగా, విద్యార్థులకు గుండెను ఎలా కాపాడుకోవాలో ,గుండె పోటు ఏ విధంగా అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు వహించాలో, మరియు వ్యక్తిగత శుభ్రత పై, మరియు, తీసుకునే సమతుల్య ఆహార నియమాలను, వీరికి తెలియజేశారు గుండెని కాపాడుకోవాలంటే ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉప్పు చక్కెర, మానసిక ఒత్తిడి,జీవనశైలిలో ప్రతి వ్యక్తి దూరం చేయాలి అని , తెలియ చేశారు ,ఆ తరువాత ఏకలవ్య స్కూల్లోని విద్యార్థులు గీసినటువంటి చిత్రాలను, సందర్శించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం అతనితో ఆరోగ్యాన్ని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.