BREAKING
రాముడైనా.. శివుడైనా ఆరాధ్య దైవాలే శంషాబాద్‌ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం ఉదయం 11 గంటలకు మోదీ అధ్యక్షతన సమావేశం.. పలు ప్రతిపాదనలపై చర్చ బ్రెజిల్ బీఫ్ దిగుమతులపై అదనంగా 55 శాతం సుంకం విధించిన చైనా! పేద విద్యార్థుల కోసం ఎమ్మెల్యే శంకర్ ఔదార్యం ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష సైనిక సాయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రను వక్రీకరిస్తే సహించం తైవాన్‌పై చైనా ఆగ్రహం! తైవాన్ పట్ల అమెరికా భద్రతా హామీలను తప్పకుండా నిలబెట్టుకోవాలి +సూపర్‌ ఇంటెలిజెన్స్‌పై చర్చ+అత్యాధునిక కృత్రిమ మేధస్సు భద్రత, నియంత్రణ, భవిష్యత్‌ ప్రభావాలపై కూడా… నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి ఉత్తర కొరియా సరిహద్దు బలపరిచే పనులను తక్షణమే నిలిపివేయాలి ఇండోనేషియాలో ప్రతిష్టాత్మక ఉచిత భోజన పథకం మాజీ ఎమ్మెల్యే వీరయ్య కాంగ్రెస్ వాది.. బిఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం అవాస్తవం. సీఎం పర్యటన వేళ తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ సిరిసిల్లలో నేడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

మాజీ ఎమ్మెల్యే వీరయ్య కాంగ్రెస్ వాది.. బిఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం అవాస్తవం.

Select Suryaa Now
మాజీ ఎమ్మెల్యే వీరయ్య కాంగ్రెస్ వాది.. బిఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం అవాస్తవం.

 వీరయ్య బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారన్న ప్రచారం అవాస్తవం

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోస్తున్న నాయకుడు పొదెం వీరయ్య: కనుబుద్ది దేవా

దుమ్ముగూడెం సూర్య,(కల్లూరి సుమన్)

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొదెం వీరయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై డీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ కో-ఆర్డినేటర్ కనుబుద్ది దేవా తీవ్రంగా స్పందించారు.ఈ సందర్భంగా కనుబుద్ది దేవా మాట్లాడుతూ.. పొదెం వీరయ్య గారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిబద్ధత కలిగిన నాయకుడు అని అన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఒత్తిళ్లు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు.2018లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు కోట్ల రూపాయల ప్రలోభాలు వచ్చినప్పటికీ వాటికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన నాయకుడు పొదెం వీరయ్య అని కనుబుద్ది దేవా పేర్కొన్నారు.కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకుడిగా పొదెం వీరయ్యకు కాంగ్రెస్ కార్యకర్తల్లో ప్రత్యేక గౌరవం ఉందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడు పొదెం వీరయ్య అని అన్నారు.కేవలం రాజకీయ లబ్ధి కోసం కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు నమ్మవద్దని కనుబుద్ది దేవా సూచించారు.పొదెం వీరయ్య నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతే అందుకు సమాధానం. కాంగ్రెస్ జెండాను వీడని నాయకుడు పొదెం వీరయ్య గారు అని కనుబుద్ది దేవా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు.