పేద విద్యార్థుల కోసం ఎమ్మెల్యే శంకర్ ఔదార్యం
ఫరూక్ నగర్ మండల పరిధిలోని హాజిపల్లి గ్రామ పరిధిలో పేద విద్యార్థుల కోసం దాతల సహకారంతో స్వంతంగా నూతన పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం నూతన భవన నిర్మాణానికి గాను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకు స్థాపన చేశారు. చదువుకు ప్రాధాన్యమిస్తూ పేద విద్యార్థుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సేవలు భేష్ అంటూ ప్రజలు కొనియాడుతున్నారు.
జవ్వాజి రాఘవేంధర్ గౌడ్మే: మేజర్ న్యూస్ , షాద్ నగర్ .