BREAKING
.20.87 కోట్లతో బుక్కపట్నం మండలంలో 53 అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పల్లెపండుగ 3.o రేపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక ప్రెస్‌మీట్ ఏపీలో పెన్షన్‌దారులకు శుభవార్త.. అక్టోబర్‌ 1 నుంచే పంపిణీ ధ్రువీకరణ పత్రాల రీ-ఇష్యూ నిలిపివేత ఈ-చలానాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క అంత్యక్రియలకు 5000 రూపాయల ఆర్థిక సహాయం పల్లె పండుగ 3.0లో నాలుగు గ్రామాల్లో రోడ్లకు భూమిపూజ ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక భేటీ.. సీఈసీ తొలగింపుపై చర్చ ప్రజల ఆరోగ్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి మా ఇంట్లో మొత్తం 16 ఓట్లు ఉన్నాయి.. అవన్నీ బాస్ (జనసేన)కే”-విజయలక్ష్మి గునుకుల-జనసేన రెండు శతాబ్దాల్లో తొలిసారిగా మహిళకు మరణశిక్ష అమలు చేయనున్న అమెరికాలోని టెన్నెస్సీ! సీఎం సభకు సర్వం సిద్ధం బ్రిటన్ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి రక్షణ రంగం కొత్త ఊపు

విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించిన జడ్జి వంశీకృష్ణ

Select Suryaa Now
విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించిన జడ్జి వంశీకృష్ణ

అనపర్తి,  మేజర్ న్యూస్. విద్యార్థులు విద్యాభ్యాస దశ నుంచే చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి ఎం. వంశీకృష్ణ అన్నారు. అనపర్తిలోని శ్రీ కర్రీ అప్పారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి వంశీకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా సమాజంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బాలల హక్కులు, మహిళల రక్షణ, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.చట్టాలపై సరైన అవగాహన ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చట్టబద్ధంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమకు తెలిసిన న్యాయ విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి సమాజంలో న్యాయ అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని, సందేహాలను న్యాయ నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రమణమూర్తి, న్యాయవాది లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొని విద్యార్థులకు పలు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. చట్టాలను గౌరవించడం, నిబంధనలను పాటించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.