BREAKING
డిమాండ్ల సాధనకు పెన్షనర్లు గళం కలెక్టర్ కి వినతి అర్హుల అన్యాయం జరిగిందని అభ్యర్థుల ఆందోళన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయుడు-నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అనంతపురం నగరంలో రూ.2.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నంద్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు -యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలుజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న నందమూరి మోక్షజ్ఞ.. ప్రత్యేక శిక్షణతో పూర్తి సిద్ధం! ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. ఖాతాలో తొమ్మిదో స్వర్ణం రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు గన్నవరం కళాశాల విద్యార్థిని గాంధీ జయంతి వేడుకలకు ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు కళ్యాణ్ లక్ష్మి, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పాఠశాలల కాంపౌండ్‌ వాల్స్‌కు రూ.8 కోట్ల CSR నిధులు ఇవ్వండి* *HPCL RMను కోరిన మంత్రి సవిత* .20.87 కోట్లతో బుక్కపట్నం మండలంలో 53 అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పల్లెపండుగ 3.o రేపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక ప్రెస్‌మీట్

ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక భేటీ.. సీఈసీ తొలగింపుపై చర్చ

Select Suryaa Now
ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక భేటీ.. సీఈసీ తొలగింపుపై చర్చ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఇండియా కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ, తేజస్వి యాదవ్‌, ఒమర్‌ అబ్దుల్లా తదితర నేతలు సమావేశానికి హాజరయ్యారు. 

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారశైలి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీప్యాట్‌ అంశాలపై ఉమ్మడి కార్యాచరణపై నేతలు చర్చించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపాదిత తీర్మానానికి ఎంపీల మద్దతు కూడగట్టే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. 

ఎన్నికల సంఘం అంశంపై కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి పెంచడంతో పాటు పార్లమెంట్‌తో పాటు ప్రజాక్షేత్రంలోనూ ఉమ్మడి ఆందోళనలు చేపట్టే కార్యాచరణను ఖరారు చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం తన నిర్ణయాలు చట్టబద్ధ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంటోంది. 

అయితే ఈ సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే, బీజేడీ, టీవీకే దూరంగా ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వ్యక్తిగతంగా హాజరుకాకపోయినా, ఆ పార్టీ తరఫున సీనియర్‌ నేతలు పాల్గొంటున్నారు.