BREAKING
డిమాండ్ల సాధనకు పెన్షనర్లు గళం కలెక్టర్ కి వినతి అర్హుల అన్యాయం జరిగిందని అభ్యర్థుల ఆందోళన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయుడు-నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అనంతపురం నగరంలో రూ.2.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నంద్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు -యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలుజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న నందమూరి మోక్షజ్ఞ.. ప్రత్యేక శిక్షణతో పూర్తి సిద్ధం! ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. ఖాతాలో తొమ్మిదో స్వర్ణం రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు గన్నవరం కళాశాల విద్యార్థిని గాంధీ జయంతి వేడుకలకు ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు కళ్యాణ్ లక్ష్మి, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పాఠశాలల కాంపౌండ్‌ వాల్స్‌కు రూ.8 కోట్ల CSR నిధులు ఇవ్వండి* *HPCL RMను కోరిన మంత్రి సవిత* .20.87 కోట్లతో బుక్కపట్నం మండలంలో 53 అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పల్లెపండుగ 3.o రేపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక ప్రెస్‌మీట్

ఏపీలో పెన్షన్‌దారులకు శుభవార్త.. అక్టోబర్‌ 1 నుంచే పంపిణీ

Select Suryaa Now
ఏపీలో పెన్షన్‌దారులకు శుభవార్త.. అక్టోబర్‌ 1 నుంచే పంపిణీ

 నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది పెన్షన్‌దారులకు పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందనుంది. ఇటీవల బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా పెన్షన్ల పంపిణీపై కొంత ఆందోళన నెలకొంది. అయితే బ్యాంకు ఉద్యోగులు సమ్మె విరమించడంతో పెన్షన్ల పంపిణీకి మార్గం సుగమమైంది. అక్టోబర్‌ 1న ఉదయం నుంచే గ్రామ, వార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెల పెన్షన్‌పై ఆధారపడే లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది.

61.80 లక్షల మంది లబ్ధిదారులు
 రూ.2,692.34 కోట్ల నిధులు
 అక్టోబర్‌ 1 నుంచి పంపిణీ
 ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభం