పల్లె పండుగ 3.0లో నాలుగు గ్రామాల్లో రోడ్లకు భూమిపూజ
పల్లె పండుగ 3.0లో నాలుగు గ్రామాల్లో రోడ్లకు భూమిపూజ
రాప్తాడు మేజర్ న్యూస్ :
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రాప్తాడు మండలంలోని నాలుగు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరపు మురళి ఆదేశాల మేరకు పాలబావి, చాపట్ల, గొల్లపల్లి, హంపాపురం గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో మండల నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, బీఎల్‌ఏలు, బూత్ కన్వీనర్లు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, యానిమేటర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.