ప్రజల ఆరోగ్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పెనమలూరు, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : పెనమలూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, ఆపద సమయంలో అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.8,23,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఎల్‌ఓసీ పత్రాలను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం వల్ల వైద్య ఖర్చుల భారం కొంత మేర తగ్గుతుందని నాయకులు తెలిపారు. ప్రజల కష్టాల్లో వారికి అండగా నిలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.