సద్దుల బతుకమ్మ ,దసరా పండగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి సూర్యప్రతినిధి , మేజర్ న్యూస్, తెలంగాణ ఆడపడుచుల గొప్ప పండుగ సద్దుల బతుకమ్మ పర్వదినం మరియు విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆడపడుచులంతా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకున్నారు.
రిపోర్టర్; రవీందర్, భూపాలపల్లి, భూపాలపల్లి జిల్లా