BREAKING
సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

రవీంద్ర భారతిలో ఘనంగా సమాచార హక్కు చట్టం–2005 ఆవిర్భావ దినోత్సవం & అవగాహన సదస్సు

Select Suryaa Now
రవీంద్ర భారతిలో ఘనంగా సమాచార హక్కు చట్టం–2005 ఆవిర్భావ దినోత్సవం & అవగాహన సదస్సు

 

హైదరాబాద్, అక్టోబర్ 7:సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం –2005 ఆవిర్భావ దినోత్సవం & అవగాహన సదస్సు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్ని జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి షేక్ గౌస్ సభాధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సమాచార హక్కు చట్టం–2005 ప్రాధాన్యత, ప్రజలకు సమాచారం పొందే హక్కు, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంపొందించడంలో ఆర్టీఐ చట్టం పాత్రపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గ మరియు గ్రామ స్థాయి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆర్టీఐపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రజల హక్కులకు సంబంధించిన సమస్యలపై నిరంతరం 24×7 పనిచేస్తూ ప్రజా చైతన్యం కోసం కృషి చేస్తోందని జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ తెలిపారు.

అదేవిధంగా, నవంబర్‌లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో ఆర్టీఐకి సంబంధించిన ప్రధాన డిమాండ్లపై ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఆర్టీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు సమాచార హక్కు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం వంటి ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ దృష్టికి డిమాండ్లను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

“ఆర్టీఐ కోసం మా సంస్థ కార్యక్రమం ఒకరోజుకే పరిమితం కాదు… ప్రజల హక్కుల కోసం నిరంతరం 24×7 పనిచేస్తూనే ఉంటాము” అని డా. చంటి ముదిరాజ్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఆర్టీఐ జిల్లా కో-ఆర్డినేషన్ వ్యవస్థలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులకు తగిన ప్రాముఖ్యత కల్పించాలని, అలాగే గతంలో ఉన్న జిల్లా ఆర్టీఐ మానిటరింగ్ మెంబర్స్ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ ఉపాధ్యక్షులు గోపీనాథన్ కట్టెకోల, జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, రాధ కృష్ణ,జాతీయ సహాయ కార్యదర్శులు అన్నవరం సందీప్ రెడ్డి, వంగల వివేకానంద, మార్క నవీన్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ మహేష్, రాష్ట్ర లీగల్ వింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులు రవి కుమార్, రాష్ట్ర కన్వీనర్ కిఫాయత్, అధికార ప్రతినిధి సతీష్ కుమార్, కో కన్వీనర్ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్, అరవింద స్వామి, కార్తీక్ రెడ్డి, సాయిరాం, రాష్ట్ర కార్యదర్శులు నవీన్ కుమార్ ,కండే సాగర్, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.