BREAKING
వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు

రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన

Select Suryaa Now
రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన

రాయికోడ్, ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని సోమవారం రాయికోడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రబీ సీజన్‌కు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. పంటల వైవిధ్యీకరణ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనువైన పంటల ఎంపిక, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. పంటల సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, రైతులకు అందుబాటులో ఉన్న సేవలను వివరించారు. వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వారి సలహాలు, సూచనలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.ఈయొక్క  కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కచూర్ రావు, దేవాదాయ శాఖ చైర్మన్ సతీష్, రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేదార్‌నాథ్ పాటిల్, మండల వ్యవసాయ అధికారి సారిక, వ్యవసాయ విస్తరణ అధికారులు నిఖిలేష్, అర్చన శ్రీ, కల్పనతో పాటు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.