మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ
షాద్ నగర్ పట్టణ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ఇటీవల మోకాలి శస్త్రచికిత్స పూర్తి చేసుకుని పట్టణంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కౌన్సిలర్ ఈశ్వర్ రాజును ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఈశ్వర్ రాజు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ ఆయన ఆరోగ్య పరిస్థితిని మరియు చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శలో పోమాలపల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,శేరి గూడ మాజీ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి,పాత్రికేయులు మోహన్ రెడ్డి,నాయకులు వెంకట్ రెడ్డి,శంకర్ నాయక్,దినేష్ సాగర్,శేఖర్ అప్పా,నరేష్ చారి,హరి నాయక్,దీపక్, మరియు ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.