BREAKING
మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే?

ప్రపంచ స్థాయి దీటుగా తెలంగాణ విద్యారంగం

Select Suryaa Now
ప్రపంచ స్థాయి దీటుగా తెలంగాణ విద్యారంగం

విద్య ద్వారానే సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారీగా నిధులు కేటాయించడంతోపాటు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జీ తెలుగు న్యూస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురు వందనం–ఎడ్యుకేషన్‌ కాంక్లేవ్‌ అండ్‌ టీచర్స్‌ అవార్డ్స్‌–2026’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులను ఉన్నతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 


‎
‎సమాజంలో విద్య ఎంతగా అభివృద్ధి చెందితే, ఆ సమాజం అన్ని రంగాల్లో అంతగా పురోగమిస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు సైతం నిరూపించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా పరిస్థితుల సర్వేలోనూ విద్యకు ఉన్న ప్రాధాన్యం స్పష్టమైందన్నారు. వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు అభివృద్ధి సాధించడానికి విద్య కీలకమైన మార్గమని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని, విద్యారంగ అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు

‎ఉపాధ్యాయ నియామకాలు.. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం
‎విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు డీఎస్సీ ద్వారా పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల నియామకాలను కూడా పూర్తి చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యాబోధన అందించడంతోపాటు విద్యార్థుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకుల, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్‌ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్‌ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనికి అదనంగా వారానికి మూడు రోజులు పాలు లేదా రాగిజావ అందించే కార్యక్రమాన్ని కూడా విస్తరిస్తున్నామని చెప్పారు.

‎105 యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలలు
‎
‎అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 105 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,000 నుంచి 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రీడలు, మైదానాలు, ఇతర పాఠ్యేతర కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు సైతం పాఠశాలల ప్రాంగణాల్లో నివాస సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యకే పరిమితం కాకుండా ఉన్నత విద్యారంగ అభివృద్ధిపైనా దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో అవసరమైన నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి, ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సాంకేతిక విద్యలోనూ సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. ఐటీఐ కళాశాలలను ఆధునికీకరించడంతోపాటు పాలిటెక్నిక్‌ విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆధునిక యంత్రాలు, కంప్యూటరైజ్డ్‌ సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

‎ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే లక్ష్య సాధన
‎విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌గా మారుతాయని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య ద్వారా తెలంగాణ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమై ప్రపంచంతో పోటీపడే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ‘గురు వందనం’ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొంటూ, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్య సాధనలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్,  శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జీ న్యూస్ సిఈఓ మరియు ఎడిటర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

‎