ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అప్పరెడ్డి గూడ గ్రామ సర్పంచ్ సందీప్ గౌడ్
షాబాద్ : షాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ పోలేపల్లి సందీప్ గౌడ్, లబ్ధిదారు కురుమ మల్లమ్మ భీమయ్యతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
( షాబాద్ - మేజర్ న్యూస్)