BREAKING
వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..... సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ. విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి గేమింగ్ కంపెనీలపై యూయూ మద్దతుతో దర్యాప్తునకు దిగిన ఇటలీ దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు! చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్ ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్య మంచిర్యాల టౌన్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు.బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు.కళాశాల ప్రాంగణం బతుకమ్మ పాటలు, సందడి నడుమ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన పండుగ అని అన్నారు. ప్రకృతితో మమేకమై పూలను పూజించే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు.యువతరం మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.కళాశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.