BREAKING
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం మానవతా స్ఫూర్తితో రక్తదానం రాష్ట్ర స్థాయి కుంగ్- ఫూ కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీయులు

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

Select Suryaa Now
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

పరకాల ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొజ్జ హేమంత్


పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పరకాల ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొజ్జ హేమంత్ డిమాండ్ చేశారు. బుధవారం
పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ పరకాల పట్టణ అధ్యక్షులు బొజ్జ హేమంత్  మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని అలాగే విద్యార్థినీ విద్యార్థులు బాత్రూమ్స్ లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.  వెంటనే వారికి బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి గ్రౌండ్ మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలన్నారు. లేనియెడల
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  అనేక ఉద్యమాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు 
కార్యక్రమంలో పరకాల పట్టణ గర్ల్స్ కన్వీనర్ శ్రీ వర్ష , ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు రాహుల్ , అజయ్, బన్నీ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.