పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సూర్య, చింతలమానేపల్లి:చింతలమానేపల్లి గ్రామానికి చెందిన బల్దారపు రాజన్న ఇటీవల కాలికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాజన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా చింతలమానేపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొండు తిరుపతి తండ్రి కొండు విఠల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో నాయకులు నిలాగౌడ్, శ్రీనివాస్, ప్రవీణ్, రత్నం పాపయ్య, శంకర్, సాగర్, ఫణేందర్, సంతోష్, ప్రకాశ్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.